English   

ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయ‌డం త‌ప్పే అంటున్న బాల‌య్య‌..

Balakrishna
2019-02-25 02:48:42

అదేంటి.. బాల‌య్య ఎందుకు అలా అంటాడు అనుకుంటున్నారా..? ఆయ‌న ఎందుకు అలా అంటాడు కానీ అలా అనేలా చేసాడు వ‌ర్మ‌. ఈయ‌న త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఏం చేయ‌మ‌న్నా చేసేలా క‌నిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుద‌ల కోసం చూస్తున్నాడు వ‌ర్మ‌. ఈ చిత్ర బిజినెస్ కూడా ఇప్పుడు సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఒక‌టి రెండు కాదు విడుద‌ల‌కు ముందే నిర్మాత‌ల‌కు దాదాపు ఆరింత‌లు లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇక ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం ఏకంగా బాల‌య్య‌నే వాడేసుకున్నాడు వ‌ర్మ‌. త‌న ట్విట్ట‌ర్లో బాల‌య్య వాయిస్ తో ఓ పోస్ట్ పెట్టాడు.  నా మొత్తం జీవితంలో వాన్ని న‌మ్మ‌డ‌మే నేను చేసిన అతిపెద్ద పొర‌పాటు అని ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్లో డైలాగ్ ఉంటుంది క‌దా.. ఇప్పుడు దాన్ని బాల‌య్య కోసం కాస్త మార్చి మిమిక్రీ చేయించాడు వ‌ర్మ‌. నా మొత్తం జీవితంలో నేను చేసిన అతి పెద్ద త‌ప్పు ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయ‌డం అంటూ బాల‌య్య‌తోనే చెప్పించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇది చూసి నంద‌మూరి అభిమానులు మండిపోతున్నారు. త‌మ హీరో గురించి ఇలాంటి పోస్టులు పెడ‌తావా అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కానీ ఎవ‌రేం అన్నా వ‌ర్మ మాత్రం త‌ను చేయాల్సింది చేస్తూ పోతున్నాడు. మార్చ్ 15న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడు వ‌ర్మ‌. 

More Related Stories