పవన్ ని ఎత్తేస్తున్న వర్మ...ప్రమోషన్ కోసమేనా ?

నిన్న మొన్నటి వరకూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ మీదా విమర్శలు గుప్పించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సడెన్ గా పవన్ ను ఎత్తేస్తున్నాడు. సీబీఎన్ పీకేని గత ఎన్నికల్లో అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచినందుకు ప్రతీకారంగా రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తన నైజములో ఉన్న నిజాయితీతో నారా చంద్రబాబు నాయుడుని ముందుపోటు పొడుస్తాడని పీకే పవర్ మీద నా అత్యంత మెగా నమ్మకం’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వదిలాడు వర్మ. ఆ తరవాత ‘బ్రహ్మం గారు నాకు చెవిలో చెప్పింది పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీలో సీఎం అవుతాడు గెలవకపోతే గెలిచిన సీఎంకి మొగుడౌతాడు.. తదాస్తు’ అంటూ ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత రాత్రి వర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతీ విషయాన్ని ప్రమోషన్ కు వాడుకోవడం వర్మకు వెన్నతో పెటిన విద్య. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు సిద్దమవుతున్న తరుణంలోనే వర్మ బాబుని తిట్టి పవన్ ఫ్యాన్స్ ను ప్రసంన్నం చేసుకునే పనిలో పడ్డాడని అంటున్నారు సినీ విశ్లేషకులు.