English   

వెంకీ మామ క‌దిలాడు.. వెంక‌టేష్ కు ఆ సెంటిమెంట్ క‌లిసొస్తుందా..? 

Victory-Venkatesh
2019-02-25 11:28:59

తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చాలానే వ‌స్తున్నాయి. ముఖ్యంగా సీనియ‌ర్ హీరోలు వీటిని బాగానే ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు వెంక‌టేష్ ఇప్పుడు చేస్తోన్న ఎఫ్ 2 కానీ.. చిరంజీవి సైరా కానీ అన్నీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలే. ఇదే దారిలో ఇప్పుడు వెంకీ మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. మేన‌ల్లుడు నాగ‌చైత‌న్యతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు వెంక‌టేష్. ప్రేమ‌మ్ లో కాసేపు మామ‌గా క‌నిపించి మాయం అయిపోయాడు వెంక‌టేష్. ఇప్పుడు పూర్తిగా ర‌చ్చ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా వెంకీమామ‌. ఈ చిత్ర షూటింగ్ ఇన్నాళ్ల‌కు ఓపెన్ అయింది. రాజమండ్రిలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. అక్క‌డే మ‌రో నెల రోజుల పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు బాబీ. జై ల‌వ‌కుశ త‌ర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని బాబీ చేస్తోన్న సినిమా ఇది. పూర్తిగా గ్రామ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఇందులో చైతూకు జోడీగా న‌భా న‌టేష్.. వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్ పుత్ న‌టిస్తున్నారు. 

ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్టైనర్ గా వెంకీ మామాను తెర‌కెక్కించ‌నున్నాడు ద‌ర్శ‌కుడు బాబీ. ఈ సినిమాకు కూడా కోన వెంక‌ట్ త‌న ర‌చ‌నా స‌హ‌కారం అందించాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. అప్ప‌ట్లో ఇత‌ర సినిమాల కోసం వెంకీ మామాను ప‌క్క‌న‌బెట్టాడు నాగ‌చైత‌న్య‌. అయితే ఆశ‌లు పెట్టుకున్న శైల‌జారెడ్డి అల్లుడు.. స‌వ్య‌సాచి రెండూ ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు చైతూ ఆలోచిస్తున్నాడు. అందుకే కాస్త ఆల‌స్యం అయినా ప‌ర్లేదు కానీ క‌థ‌లో మ‌ళ్లీ ప‌క్కాగా అన్ని చూసుకున్న త‌ర్వాత కానీ వెంకీమామ ప‌ట్టాలెక్కించాడు ద‌ర్శ‌కుడు బాబీ. అల్లుడికే వెంక‌టేష్ స‌పోర్ట్ కూడా ఉంది. దాంతో వెంకీమామాతో మ‌రోసారి మ‌ల్టీస్టార‌ర్ సెంటిమెంట్ క‌లిసొచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని చూస్తున్నాడు వెంక‌టేష్. ఎఫ్2 ఇలాగే అయింది కూడా. ఇప్పుడు అల్లుడి విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంద‌ని భావిస్తున్నాడు వెంకీ. 

More Related Stories