English   

మహేష్ దారిలో కళ్యాణ్ రామ్ !

Kalyan-Ram
2019-02-25 04:44:26

హీరో మహేష్ బాబు వెబ్ సిరీస్ మార్కెట్లోకి ఎంటర్ కాబోతున్నాడనే విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ మీద చార్లీ అనే వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు మహేష్ ను కళ్యాణ్ రామ్ ఫాలో అవుతున్నట్టు సమాచారం. తను కూడా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించాడు నందమూరి హీరో. కల్యాణ్ రామ్ కు ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ పై తనే నిర్మాత, హీరోగా ఎక్కువగా సినిమాలు చేశాడు కల్యాణ్ రామ్. ఇప్పుడీ బ్యానర్ ను మరింత విస్తరించే క్రమంలో వెబ్ సిరీస్ కూడా నిర్మిస్తామని ప్రకటించాడాయన. యూత్ ను దృష్టిలో పెట్టుకొని ప్రేమ, క్రైమ్‌, థ్రిల్లర్‌ అంశాలతో కూడిన వెబ్‌ సిరీస్‌ను త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రలో మెప్పించిన కళ్యాణ్ రామ్ తాజాగా 118 అనే విభిన్న కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమా మార్చి 1న విడుదల కానుంది. ఏఎ ఏడాది సక్సెస్ లు లేక కళావిహీనంగా మారింది బాలీవుడ్ బాక్సాఫీస్ చూడాలి  ఆ లోటుని కళ్యాణ్ రామ్ భర్తీ చేస్తాడేమో చూడాలి.

More Related Stories