English   

ఆ సంస్థ మీద కేస్ వేసిన నాగ్...ఎందుకంటే ?

Nagarjuna
2019-02-25 05:18:25

అక్కినేని నాగార్జున ఓ కార్పొరేట్ సంస్థ మీద సీరియస్ అయ్యాడు. అంతటితో అగకుండా సదరు సంస్థ మీద కాపీ రైట్స్ కేసు కూడా వేశాడు. ఆ సంస్థ ఏదో కాదు ఇండియాలోనే స్పీడేస్ట్ నెట్వర్క్ అని చెబుతున్న యాక్ట్ ఫైబర్ నెట్‌. కొన్ని రోజుల క్రితం తమ బ్రాండింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సంస్థ ఓ లోగోను విడుదల చేసింది. ఆ లోగోలో ఎ అక్షరం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ లోగో స్టైల్లోనే ఉండటంతో తమ పర్మిషన్ లేకుండా తమ సంస్థ స్టైల్‌ను కాపీ కొట్టడంతో నాగ్ సీరియస్ అయ్యి కేసు పెట్టాడు. ఆక్ట్ ఫైబర్ కు ఇంతకుముందు లోగో మరోలా ఉండేది కానీ తాజా లోగో మాత్రం అన్నపూర్ణ బ్రాండ్ తో ఉండటంతోనే ఈ కేసు వేసినట్టు చేబుతున్నారు నాగార్జున. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. తీర్పు వచ్చే వరకు యాక్ట్ ఫైబర్ నెట్ సంస్థ ప్రమోషన్స్‌లో విడుదల చేసిన లోగోను ఉపయోగించకూడదని జడ్జి స్టే ఆర్డర్ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే దేవదాస్ తో హిట్ కొట్టిన నాగ్ మన్మధుడు 2 కోసం రెడీ అవుతున్నాడు.

More Related Stories