English   

ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి తేజ ఎందుకు త‌ప్పుకున్నాడు..? 

NTR-Biopic
2019-02-25 06:44:20

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ ఎందుకు తప్పుకున్నాడు.. దీనికి సమాధానం ఇన్నాళ్లు తెలియలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మాత్రం ఈయన కావాలని తప్పుకున్నట్లు అర్థమవుతుంది. ఎన్టీఆర్ మహానాయకుడు ఫలితం చూసిన తర్వాత అభిమానులు, ప్రేక్షకులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఈ ఫలితాన్ని ముందే ఊహించారు కాబట్టే తేజ తెలివిగా తప్పుకున్నాడు అంటూ చెప్పుకుంటున్నారు. అందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే తేజ చేతికి ఎన్టీఆర్ బయోపిక్ వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన కాస్త కాంట్రవర్సీగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. అది కూడా ఒక భాగంలోనే అంతా చూపించాలనుకున్నాడు. కానీ బాలకృష్ణ మాత్రం ఒప్పుకోలేదు. ఇద్దరికీ క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో తేజ బయోపిక్ నుంచి బయటికి వచ్చేశాడు. 

అయితే దీనికి కారణం బాలకృష్ణ మరోలా చెప్పాడు. ఎన్టీఆర్ లాంటి మహానాయకుడు జీవితాన్ని తెరకెక్కించే ధైర్యం తాను చేయలేనని.. అంత ఒత్తిడి భరించలేకపోతున్నాను అంటూ తనతో చెప్పి తేజ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడని ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలకు ముందు చెప్పాడు. ఆ తర్వాత క్రిష్ ఈ చిత్ర‌ బాధ్యతలు తీసుకున్నాడు. ఒక్కసారి ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత భారీ అంచనాలు వచ్చేశాయి. కానీ కథానాయకుడు సినిమా ఊహించిన దాని కంటే భారీ డిజాస్టర్ కావడంతో తేజ నిర్ణయం సరైనదేనని అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు మహానాయకుడు సినిమా ఫలితం చూసిన తర్వాత నిజంగానే తేజ త‌ప్పుకోవ‌డం మంచిదే అయింది అంటూ చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు. తేజ కూడా కావాలని సినిమా నుంచి తప్పుకున్నట్లు ఇప్పుడు స్ప‌ష్టం అవుతుంది. 

More Related Stories