English   

ఇండియన్ సినిమాకి ఆస్కార్ !

Guneet-Monga
2019-02-25 07:02:58

ఆస్కార్ అవార్డుల పండుగలో ఈసారి ఇండియాకూ చోటు దక్కింది. ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్‌ వేడుకలో ఇండియన్ డాక్యుమెంటరీ ‘పీరియడ్: ఎఫ్ అండ్ సెంటెన్స్’ సత్తా చాటింది. షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంకి అవార్డు లభించింది.  ప్రముఖ నిర్మాత గునీత్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ ఇండియాలోని అనేక ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుస్రావ సమస్యలను అర్ధమయ్యే రీతిన చూపించారు దర్శకురాలు రేకా జెహ్‌తాబ్బి. రుతుస్రావ సమయంలో శానిటరీ ప్యాడ్స్ లేని మహిళల ఆరోగ్యంపై కలిగే ప్రభావాన్ని ఈ సినిమాలో చూపారు. అమెరికా లాస్ ఏంజిలిస్ లోని ఓక్ వుడ్ స్కూలు విద్యార్థులు ప్రారంభించిన 'ది ప్యాడ్ ప్రాజెక్ట్' లో భాగంగా తాము దీన్ని తీసినట్టు గునీత్ మోంగా తెలిపారు. తమకు దక్కిన ఈ అవార్డును ఆ స్కూలుకు అంకితమిస్తున్నట్టు యూనిట్ తెలిపింది. భారత్ లోని మహిళలు తమ సమస్యను మానవ హక్కులకు సంబందించిన సమస్యగా భావిస్తున్నారని ఢిల్లీ శివారులోని హాపూర్ అనే గ్రామంలో ఈ డాక్యుమెంటరీని షూట్ చేశారని యూనిట్ చెబుతోంది. ఈ గ్రామంలోని మహిళలకు శానిటరీ న్యాప్ కిన్స్ లేక రుతుస్రావ సమయంలో పడుతున్న ఇబ్బందులను, చివరకు ఇక్కడ ప్యాడ్ వెండింగ్ మెషిన్ ను ఏర్పాటు చేయడంతో వారి సమస్య పరిష్కారమైన విషయాన్ని ఈ షార్ట్ ఫిలింలో చిత్రంలో హైలైట్ చేశారు. 

More Related Stories