English   

సాక్షి యాంకర్ గా రేణు దేశాయ్...ఇదీ నిజం !

Renu-Desai
2019-02-25 08:13:07

పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ లు విడిపోయి ఎవరి దారిన వారు బిజీగా ఉన్నారు. గత సంవత్సరం రేణుదేశాయ్ అమెరికాకు చెందిన ఒక వ్యక్తిని పెళ్లాడబోతున్నట్లు ప్రకటిస్తే పవన్ సినిమాలను వదిలి రాజకీయం చేస్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ వేరువేరు మార్గాలలో పయనిస్తున్నా యాదృశ్చికంగా వీరిద్దరూ వేరువేరు కార్యక్రమాలతో కర్నూల్ జిల్లాలో ఒకేసారి ఎవరికివారు పర్యటనలు చేస్తూ ఉండటం పవన్, జగన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. రేణు దేశాయ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడిన రెండు రైతు కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీ యాంకర్ లాగా ఆ చానల్ మైక్ పట్టుకుని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు వచ్చిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఓ వైపు పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే అదే జిల్లాలో రేణు దేశాయ్ కూడా సందడి చేస్తుండటం, అది కూడా సాక్షి టీవీ లోగో పట్టుకుని రైతులను ఇంటర్వూలు చేస్తుండటం అదీ కాక నిన్న పవన్ పర్యటించిన ప్రాంతంలోనే ఈ తంతు చేయడం వైసీపీ, జనసేన శ్రేణుల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. పవన్ కు పోటీగా రేణు దేశాయ్ ని వైసీపీ రంగంలోకి దించిందని ప్రచారం మొదలయింది, దీని వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉందని కూడా అంటున్నారు.  అయితే అందుతున్న సమాచారం మేరకు ఆమె రైతు ఆత్మహత్యల ఇతివృత్తంతో ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె రైతుల కుటుంబాలను కలుస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె డాక్యుమెంటరీ షూట్ లో భాగంగా సాక్షి రిపోర్టర్ పాత్ర పోషిస్తున్నారా ? అనే చర్చ కూడా మొదలయ్యింది. అదే అయితే తన మాజీ భర్తను అన్నేసి మాటలు అన్న జగన్ కు చెందిన చానల్ మైకుతో ఆమె ఎందుకు నటిస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనికి ఆమె ఏ విధమైన సమాధానం చెబుతుందో ? వేచి చూడాలి మరి. 

More Related Stories