English   

రాజ‌మౌళి మామూలుగా లేడుగా.. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో ఆడుకుంటున్నాడు.. 

RRR
2019-02-25 16:38:03

ఒక్కసారి రాజమౌళి ఫిక్స్ అయిన తర్వాత ఎవరి మాటా వినడు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు ఈయ‌న‌. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో సహా దుబాయ్ లో ఉన్నాడు. పర్సనల్ టూర్ తో పాటు సినిమాకు సంబంధించిన శిక్షణ కూడా తీసుకుంటున్నాడు జూనియర్. ఈయన మార్చి మొదటి వారంలో ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే షూటింగ్ లో పాల్గొంటారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నాడు రాజమౌళి. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా రాజమౌళి కంట్రోల్ లోనే ఉందని తెలుస్తుంది. సినిమా మొదలయ్యే ముందు వరకు కూడా కథ చెప్పకుండానే అటు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ ను ఒప్పించిన ఘనత దర్శకధీరుడు సొంతం. 

ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సినిమాకు సంబంధించిన పూర్తి అధికారం రాజమౌళి చేతుల్లోనే ఉంది. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ముందు రాజమౌళి దగ్గర నుంచి ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందే. సినిమాకు సంబంధించిన విషయాలు కూడా ఎక్కడ చెప్పకూడదని కండిషన్ పెట్టాడు రాజమౌళి. ఇద్దరు సూపర్ స్టార్స్ ను తన సినిమాలో ఉంచుకొని కూడా వాళ్ళని పూర్తిగా తన చెప్పుచేతుల్లో పెట్టుకున్నాడు దర్శక ధీరుడు. అది ఆయన ప‌వ‌ర్. షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ మరో సినిమా ఒప్పుకోకూడదు అనే కండిషన్ కూడా పెట్టాడు జక్కన్న. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయనున్నారు. ఇదే ఏడాది అక్టోబర్లో షూటింగ్ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి.

More Related Stories