English   

పాయ‌ల్ పేరు చెబితే ఆ వెబ్ సైట్లో డిస్కౌంట్ ఇస్తారంట‌..

Payal-Rajput
2019-02-25 11:07:54

జనానికి ఈజీగా చేరువ కావాలంటే అన్నింటికంటే ఈజీ మార్గం వెబ్ సైట్. అందులోనూ ఆన్ లైన్ వెబ్ సైట్స్ కు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఆఫ‌ర్స్ అంటే చాలు.. అది ఏంటి ఎక్కడ అని తెలుసుకోకుండా ఎగ‌బ‌డుతుంటారు జనాలు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటికే అమేజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్ డీల్ ఆన్లైన్ వెబ్సైట్ దుమ్ము దులిపేస్తున్నాయి. ఇప్పుడు షీఇన్ అనే మ‌రో వెబ్సైట్ కూడా ఇలాగే వ‌స్తుంది. అయితే ఇలాంటి ఒక వెబ్ సైట్ ఉన్న‌ట్లు ఎవరికీ తెలియదు. దాంతో ఇప్పుడు వాళ్లు హీరోయిన్స్ ను ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. ఆర్ ఎక్స్ 100తో సంచలనం సృష్టించిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు షీఇన్ అనే వెబ్సైట్ కోసం పని చేస్తుంది. దీనికి ఆన్లైన్ ప్రమోషన్ చేసిపెడుతుంది పాయల్ రాజ్ పుత్. 

ఇందులో బట్టలు కొనండి అంటూ ట్విట్టర్ లో ప్రమోషన్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అంతటితో ఆగకుండా తన పేరుతో వచ్చే ఒక కోడ్ కొడితే ఆ కొనే బట్టల్లో డిస్కౌంట్ కూడా వస్తుందని చెబుతుంది. ఇది కూడా ప్రమోషన్ కోసం వాడుకుంటుంది పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే మన్మధుడు 2సినిమాలో హీరోయిన్ గా కమిట్ అయ్యింది పాయల్ రాజ్ పుత్. దాంతో పాటు వెంక‌టేష్ వెంకీ మామాలో కూడా న‌టించ‌బోతుంది. కుర్ర హీరోలతో కాకుండా వరుసగా ఇలా సీనియర్ హీరోలతో నటించడం కూడా సాహసమనే చెప్పాలి. మొత్తానికి అటు యాడ్స్.. ఇటు సినిమా రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది ముద్దుగుమ్మ.

More Related Stories