English   

లేడీ డైరెక్టర్ మృతి...మిస్టరీ ?

Nayana-Suryan
2019-02-25 19:30:35

మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. మళయాళ ఇండస్ట్రీకి చెందిన యంగ్ లేడీ డైరెక్టర్ నయన సూర్యన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 2017కు ముందు ఆమె పలువురు సినీ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారుయువ దర్శకురాలు నయన్ మృతి సహజమా లేక ప్రేరేపిత ఆత్మహత్యా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి అనుమానాస్పద కేసు కింద విచారణ చేపట్టామని అన్ని కోణాలు ఎంక్వయిరీ నడుస్తుందని ప్రకటించారు తిరువనంతపురం పోలీసులు ఆ తర్వాత ఓ సినిమా తెరకెక్కించి అతి చిన్న వయసులోనే మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె మృతి విషయం మీద ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ పోస్ట్ మార్టం నివేదిక అందితే కానీ, మృతికి గల కారణాలను చెప్పలేమని చెబుతున్నారు. తిరువనంతపురంలో ఉన్న నయనకు ఆమె తల్లి ఫోన్ చేశారు. అయితే ఆమె ఫోన్ ఎంతకీ ఎత్తకపోవడంతో ఆమె స్నేహితులకు సమాచారం ఇచ్చారు. స్నేహితులు వచ్చి చూసే సరికి నయన విగతజీవిగా కనిపించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అందుతున్న సమాచారం మేరకు నయన్ లెనిన్ రాజేంద్రన్ అనే అగ్ర దర్శకుడి దగ్గర ఆమె సహాయ దర్శకురాలిగా పనిచేసిందని, 2019 జనవరి 14 ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో గురువులాంటి లెనిన్ లేడనే బాధ కూడా ఆమెను వెంటాడినట్లు చెబుతున్నారు. దీంతో ఆమె మృతి సహజ మరణమా లేక ప్రేరేపిత ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అదీ కాక ఆమెకు మధుమేహం ఉండడంతో ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు.
 

More Related Stories