English   

సైరాకి షాకిచ్చిన బీదర్ !

Syera Narasimha Reddy Movie Team Shock In Bidar
2019-02-25 12:55:04

మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో భారీ లెవెల్ లో తీర్చిద్దితున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాది దసరాకు విడుదల చేసి తీరాలని నిర్మాత రాం చరణ్ టార్గెట్ పెట్టడంతో ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరొవైపు గ్రాఫిక్స్ పనులలో ఏమాత్రం జాప్యం లేకుండా పూర్తి చేయడానికి సురేంద్ర రెడ్డి చాలా కష్టపడుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఊహించని విధంగా సైరా షూటింగ్ కోసం టీం అంతా బీదర్ కు వెళ్ళింది. అయితే అక్కడ పాత కాలపు కత్తులు, తలపాగాలు, గెడ్డాలు, గెటప్ లు ఇవన్నీ చూసిన తరువాత అక్కడి స్థానికులు షూట్ చేయొద్దని అభ్యంతరం చెప్పారట. అయితే అన్ని పర్మిషన్లు ఉన్నాయి అని చెప్పినా ఒప్పుకోలేదట. లోకల్స్ ని కాదనుకుని చేసేది ఏమి లేక టీం వెనక్కు వచ్చేసింది. అందుకే సురేంద్ర రెడ్డి బీదర్ వాతావరణానికి అనుగుణంగా రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ వేసి షూట్ చేయబోతున్నట్లు సమాచారం.  దసరాకి రిలీజ్ అని చెబుతున్నా ఇప్పటివరకు సినిమా రిలీజ్ మీద అయితే క్లారిటీ ఇవ్వలేదు రామ్ చరణ్. 

More Related Stories