English   

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ వెన‌క ఎన్టీఆర్ బ‌యోపిక్ నిర్మాత హ‌స్తం..

AL Vijay announced the title of Jayalalitha's biopic
2019-02-25 14:03:47

ఇప్పుడు తెలుగులోనే కాదు దేశంలోని అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్స్ హవా బాగా నడుస్తోంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన లెజెండ్స్ జీవితాలను ఇప్పుడు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి కొత్త‌గా క‌థ కూడా రాయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఉన్న క‌థ‌ను కాస్త మార్చి చెబితే స‌రిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్, సావిత్రి బయోపిక్స్ వచ్చాయి. ఇందులో ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయ్యింది. సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తమిళనాట కూడా ఒక భారీ బయోపిక్ సిద్ధం అవుతుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి దివంగత నేత జయలలిత బయోపిక్ అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. అమలాపాల్ మాజీ భర్త ఏఎల్ విజయ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.
ఫిబ్రవరి 24న‌ జయలలిత జయంతి సందర్భంగా ఈ బయోపిక్ ప్రకటించారు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విష్ణు ఇందూరి తమిళనాట జయలలిత బయోపిక్ తలైవి సినిమా నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇందులో నటించబోయే నటీనటులు టెక్నికల్ టీం త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ దీనికి సంగీతం అందిస్తుండగా నీర‌వ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తోనే జయలలిత బయోపిక్ తెరకెక్కించబోతున్నాడు ఏ ఎల్ విజయ్. ఇప్పటికే జయలలిత కుటుంబ సభ్యుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాడు దర్శకుడు. మొత్తానికి మరి లలిత బయోపిక్ ఎలా ఉండబోతుందో చూడాలి. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

More Related Stories