English   

ప్ర‌భాస్ సాహో ముచ్చ‌ట తీర్చేస్తున్నాడుగా.. గెట్ రెడీ ఫ్యాన్స్..

Shades of Saaho Chapter 2 to be released on 3rd March 2019
2019-02-25 21:34:25

ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ జరుగుతుంది.. జరుగుతూనే ఉంది.. ఇంకా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సినిమా ఇప్పటివరకు ఎంత పూర్తయింది అనేది మాత్రం దర్శక నిర్మాతలు చెప్పడం లేదు. ఇప్పటివరకు కేవలం ఒక్క టీజర్ కూడా విడుదల చేయలేదు. ఆ మధ్య ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేసి చేతులు దులుపుకున్నారు దర్శక నిర్మాతలు. మళ్లీ ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయలేదు. అయితే మార్చి 3న అభిమానుల కోరిక మేరకు సాహో మేకింగ్ వీడియో విడుదల కానుంది. ఆ రోజు హీరోయిన్ శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్.
ఇప్పటికే సాహో షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. దాదాపు రెండు వందల కోట్లతో యు.వి.క్రియేషన్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సుజిత్ కూడా ఈ సినిమా కోసం పగలు రాత్రి పని చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రభాస్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను చూడండి అంటున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఇప్పటికే మేకింగ్ వీడియోలో ఈయన పనితనం కనిపించింది. ఇప్పుడు రెండో మేకింగ్ వీడియో కూడా వచ్చి ఆకట్టుకుందంటే సాహో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని చేరిపోతాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 15న సాహో సినిమా విడుదల కానుంది.

More Related Stories