English   

మహానాయకుడు కలెక్షన్స్...ఫ్లాప్ ని చేస్తున్నాయా ?

NTR Mahanayakudu 3 Days  Box office Collections
2019-02-25 15:06:36

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగంగా వచ్చిన మహానాయకుడు సినిమా రెండ్రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలకమైన సంఘటనల ఆధారంగా ఈ రెండో భాగం తెరకెక్కించారు. ఇప్పటికే ఎన్టీఆర్ లో మొదటి భాగం డిజాస్టర్ టాక్ తెచ్చుకొని భారీ నష్టాలు మిగిల్చింది. దీంతో దర్శకుడు క్రిష్, నిర్మాతలు మహానాయకుడుకి ఎక్కువ ఆర్బాటం చేయకుండా సైలెంట్ గానే రిలీజ్ చేసారు. అయితే క్రిటిక్స్ నుండి ప్రశంశల్ని అందుకున్న మహానాయకుడుకి కలెక్షన్స్ విషయంలో ఘోరంగా దెబ్బతిన్నది. మొదటి బాగం కథానాయకుడు మొదటి వీకెండ్ మంచి వసూల్ రాబట్టింది. కానీ మహానాయకుడు ఫస్ట్ డే కూడా మేజర్ సిటీస్ లోని ప్రధాన థియేటర్లలో కూడా హౌస్ ఫుల్స్ లేవు. కారణం మొదటి భాగం మీద వున్న నెగిటివ్ టాక్. దీంతో రెండో పార్ట్ మీద ఆడియన్స్ ఆసక్తి చూపక పోవడంతో పాటు ఎన్టీఆర్ లైఫ్ లో కీలక ఎపిసోడ్స్ లేవని మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో మహానాయకుడులో ఆసక్తికర అంశాలు ఏవీ ఉండవని ఫిక్స్ అయిన ఆడియన్స్ థియటర్స్ వైపు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. మూడు రోజులకు గాను 3 .30 కోట్లు వసూళ్ళు రాబట్టి గట్టి దెబ్బే వేసిందనే చెప్పాలి.

More Related Stories