English   

పవన్ కళ్యాణ్ కు రేణు దేశాయ్ కావాలనే ఎదురెళ్తుందా..

Renu-Desai
2019-02-26 09:12:31

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్.. వీళ్ళ రిలేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 14 ఏళ్లు వీరిద్దరూ సహజీవనం చేశారు. తెలుగు ఇండస్ట్రీలో లివింగ్ రిలేషన్ షిప్ అనే కాన్సెప్ట్ కు పూర్తిగా ప్రమోషన్ చేసింది పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుని బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ నేతగా మారిపోతే.. రేణుదేశాయ్ మాత్రం అటు సినిమాలతో పాటు ఇటు టీవీవైపు కూడా అడుగులు వేస్తుంది. తాజాగా ఈమె చేసిన ఒక ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. పవర్ స్టార్ ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల బిజీలో ఉన్నాడు. జనసేన ఎవరితో కలిసి పోటీ చేయదని.. సొంతంగా ఎన్నికల బరిలో దిగుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇలాంటి సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డికి కూడా వ్యతిరేకంగానే వెళుతున్నాడు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్న పవన్ కళ్యాణ్ తన సొంత దారిని ఏర్పరచుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సాక్షి టీవీలో మట్టి మనుషులు అనే ఒక ప్రోగ్రాం చేస్తుంది. ఇది వైయస్ జగన్ ఛానల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేనతో వైసిపికి అసలు పడదు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా రేణుదేశాయ్ పెళ్లి సాక్షి కార్యక్రమం చేస్తుంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటున్నారు అభిమానులు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కోసం రేణుదేశాయ్ ని సాక్షి రంగంలోకి దింపిందా లేదంటే రేణు కావాలని టీవీ రంగం వైపు వచ్చిందా అనేది త్వరలోనే తేలనుంది.

More Related Stories