English   

కళ్యాణ్ రామ్ సినిమా పేరు పదేపదే తప్పు చెప్పిన బాలయ్య !

Balakrishna
2019-02-26 03:34:54

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 మూవీ విడుదలకు సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ నిన్న సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ కళ్యాణ్ రామ్‌ పై ప్రశంసలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు సినిమా పేరును తప్పుగా చెప్పడంతో అభిమానులు కంగు తిన్నారు. వెనక నుంచి కల్యాణ్ రామ్ హింట్ ఇచ్చే ప్రయత్నం చేసినా బాలయ్య తనదైన శైలిలో మాట్లాడుతూ పోయారు.  కల్యాణ్ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడని కొత్త వాళ్లకు ఇవ్వడం కోసం ‘అతడొక్కడే’ సినిమాను నిర్మించాడని ఆ తపన కల్యాణ్ రామ్‌ లో ఇప్పటికీ కనిపిస్తుందని కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఈస్ట్‌కోస్టు ప్రొడక్షన్ బ్యానర్‌ మీద 118 సినిమాను నిర్మించిన మహేశ్ కోనేరుకి, దర్శకుడు గుహన్‌కు, సంగీత దర్శకుడు శేఖర్ చంద్రకు, హీరోయిన్లు  నివేదా థామస్, శాలినీ పాండేకి మొగతా యూనిట్ కి బాలకృష్ణ థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా పేరు ప్రతిష్ఠలు తీసుకురావడంతోపాటు ఆర్థికంగానూ లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. 189 చిత్రం నిర్మాత అంటూ స్పీచ్ ప్రారంభించిన బాలయ్య పదే పదే 189 సినిమా అని మూవీ పేరు విషయంలో పొరపాటు పడ్డారు. తెలుగులో గుహన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 189 అని చివర్లోనూ బాలయ్య మళ్ళీ తప్పుగానే మాట్లాడారు. కళ్యాణ్ రామ్ వెనక నుంచి హింట్ అందించినా బాలయ్య పట్టించుకోలేదు.

More Related Stories