English   

జైష్ కి జోష్ హైలో ఉందంటున్న టాలీవుడ్ !

Tollywood
2019-02-26 13:12:58

భార‌త వైమానిక ద‌ళానికి చెందిన యుద్ధ విమానాలు ఈరోజు తెల్ల‌వారు ఝామున ఎల్వోసీ వెంట ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన సంగ‌తి తెలిసిందే. భార‌త్ వైమానిక దాడుల‌తో పాకిస్థాన్ బిక్కచాచ్చిండానే చెప్పాలి. ఈ దాడి మీద టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇండియ‌ర్ ఎయిర్‌ఫోర్స్‌ని వారు అభినందిస్తూ సోషల్ మీడియాలో తమ స్పందన తెలియచేస్తున్నారు. పుల్వామా దాడికి ప్ర‌తీకారంగా ఎయిర్ ఫోర్స్ జ‌రిపిన యుద్ధం భార‌త‌దేశ ప్ర‌జ‌లు గ‌ర్వ‌ప‌డేలా చేసిందని వారు పేర్కొంటున్నారు. 

భార‌త వైమానిక దళాన్ని చూసి గ‌ర్వ‌పడుతున్నా. జైహింద్‌ : రామ్‌చ‌ర‌ణ్‌

భార‌త వైమానిక ద‌ళం.. సెల్యూట్ చేస్తున్నాం. దేశం మొత్తం ఈ రోజు ఎంతో గ‌ర్వ ప‌డుతోంది. జైహింద్‌: అఖిల్ అక్కినేని.

ఎలా ఉంది జోష్...ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కు సెల్యూట్‌. జ‌యహో.. జైహింద్‌.. మేరా భార‌త్ మ‌హాన్‌: నితిన్‌.

చాలా గ‌ర్వంగా ఉంది. ఎలా ఉంది జోష్...త‌ల పైకెత్తి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సెల్యూట్ చేస్తున్నా. పై నుంచి దింపితే కింద‌కి దిగిపోయింది : వెంకీ అట్లూరి
 
జైహింద్‌.. భార‌త సైనికుల‌కు సెల్యూట్‌. భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది: సోనూసూద్‌.

ఎలా ఉంది జైష్‌. భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌-2: స‌ంపూర్ణేష్ బాబు.
 

More Related Stories