English   

బాలయ్య సినిమా రవితేజకి !

Ravi-Teja
2019-02-26 08:37:56

స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కి గత కొంత కాలంగా హిట్స్ లేవు. దీంతో అందరూ వినాయక్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ వినాయక్ కి అదే టైం లో నందమూరి బాలక్రిష్ణతో ఒక ప్రాజెక్ట్ సెట్ అయింది. సి.కళ్యాణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకి వచ్చాడు. అయితే ఈ సమయంలో వినాయక్ తో సినిమా చేస్తానన్న బాలక్రిష్ణ బోయపాటి శ్రీనుని పిలిచి తన తదుపరి సినిమా డేట్స్ శ్రీనుకి ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు మళ్ళీ వినాయక్ పరిస్థితి మొదటికే వచ్చింది. వినాయక్ కి ఏం చేయాలో తెలియాలి స్థితిలో రవితేజ వినాయక్ కి పిలిచి మరి కథ రెడీ చేసుకొని రమ్మని చెప్పాడట. ర‌వితేజ‌ని క‌లిసి స్క్రిప్ట్ వివరించడంతో ఆ క‌థ న‌చ్చ‌డంతో మాస్ రాజా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన‌ ‘కృష్ణ’ చిత్రం సూప‌ర్ హిట్ అయింది. ఇంత‌కాలానికి మ‌రో చిత్రం సెట్స్ పైకి వెళుతుంద‌ని అంటున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండ‌గానే మ‌రో సినిమాని ర‌వితేజ వినాయక సినిమా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మ‌రి ఇందులో నిజమెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.
 

More Related Stories