English   

జెస్సీ ట్రైలర్...కొత్త కాన్సెప్ట్ !

Jessie-Trailer
2019-02-26 09:22:57

హారర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ లభిస్తూనే ఉంటుంది. కథలో పెద్దగా బలం లేకున్నా కథనంతో ప్రేక్షకుడిని కూర్చోబెట్టేస్తే ఆ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్టే. ఇలాంటి చిన్న చిన్న హారర్ చిత్రాలు ఎన్నో తెలుగులో సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు అలాంటి మరో హారర్ డ్రామా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమానే జెస్సీ.  అర్చన, అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, ఆషిమా న‌ర్వాల్ లీడ్ రోల్స్ లో నటిస్తున హార‌ర్ థ్రిల్లర్ జెస్సీ. ఏకా ఆర్ట్ ప్రొడ‌క్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌ మీద అశ్విని కుమార్ ద‌ర్శక‌త్వంలో శ్వేతా సింగ్ ఈ సినిమాని నిర్మించారు. మార్చి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ ను నిన్న విడుదల చేశారు.

ట్రైలర్ ని పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. దాని బట్టి అసలు దెయ్యాలు ఉన్నాయా లేదంటే అవి వట్టి రూమర్లేనా అని తేల్చడానికి కొంత మంది ఘోస్ట్ హంటర్లు ప్రాక్టికల్స్ మొదలుపెడతారు. వీళ్లు ఓ ఇంట్లోకి వెళ్లి దెయ్యాన్ని అన్వేషిస్తారు. ఇదే విషయాన్ని ట్రైలర్‌లో చూపించారు. ఇది ఇద్దరు అక్కాచెల్లెళ్లు చుట్టూ తిరిగే కథ. ఈ ఇద్దరిలో చెల్లెలి వయసు 18 సంవత్సరాలు దాటిన తరవాత మూడు సంవత్సరాల పాటు తగ్గుతూ వచ్చిందనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్శ్శకులని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు పనిచేసిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించారు. ఆరార్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ట్రైలరే ఈ రేంజ్‌లో ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More Related Stories