English   

శ్రద్దా బర్త్ డే స్పెషల్...సాహో టీం సర్ప్రైజ్ !

Shraddha-Kapoor
2019-02-26 16:49:31

రెబల్ స్టార్ ప్రభాస్, సుజిత్ డైరక్షన్ లో భారీ అంచనాలతో రూపొందుతోన్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో మీద 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించి షేడ్స్ ఆఫ్ చాప్టర్ 1 గా అప్పట్లో ఓ మేకింగ్ వీడియో బాగా హైప్ పెంచింది. ఇక ఇప్పుడు సాహో నుండి సెకండ్ మేకింగ్ వీడియో రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. మార్చి 3న షేడ్స్ ఆఫ్ సాహో 2 రిలీజ్ చేస్తున్నారని ప్రకటించారు. మార్చి 3వ తేదీన ఈ మూవీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేయనున్నారు. ఆగష్టు 15న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు శంకర్-ఎహసన్-లాయ్ త్రయం మ్యూజిక్ అందిస్తున్నారు. బాహుబలితో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాను, తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు మేకర్స్. ఆగస్టు 15వ తేదీన విడుదల చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.   

More Related Stories