English   

ఎన్టీఆర్..మహానాయకుడి  ప్రస్తావన ఎక్కడా!!

NTR
2019-02-26 19:06:48

బాలకృష్ణ తన తండ్రి పాత్రని ఎంతో ఇష్ట పడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద తంటాలు పడుతుంది. కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్టులుగా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించాడు. అయితే కథానాయకుడు భారీ డిజాస్టర్ కాగా మహానాయకుడు సినిమా కూడా కథానాయకుడు తలతన్నే డిజాస్టర్ అయ్యేలా ఉంది ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే. మరి కథానాయకుడు రిలీజ్ అప్పుడు  తెగ హడావిడి చేసిన బాలయ్య మహానాయకుడు రిలీజ్ సమయంలో సైలెంట్ గా ఉన్నాడు. తాజాగా నిన్న నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణలు ముగ్గురూ ఒకే స్టేజి మీద కనిపించారు. కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బాలయ్య, ఎన్టీఆర్ స్పీచ్ లు హైలైట్ గా ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య తన స్పీచ్ 118 సినిమాను 189 అని పలకడం, ఎన్టీఆర్ మహానాయకుడు గురించి ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమే. అయితే బాలయ్య, కళ్యాణ్ రామ్ మహానాయకుడు గురించి ప్రమోషన్స్ లో మాట్లాడేశారు కాబట్టి నిన్న స్టేజి మీద మాట్లాడకపోయినా పెద్దగా ఫరక్ పడది కానీ  కానీ ఎన్టీఆర్ ఇంతవరకు మహానాయకుడు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వేరేవేరే వాళ్ళు దీని మీద స్పందించినా కానీ తారక్ స్పందించలేదు, నిన్న కూడా ఆయన ఎందుకు మాట్లాడలేదు అనేది అనేక చర్చలకు తావిస్తోంది. 

More Related Stories