English   

అప్పుడే ఇస్మార్ట్ శంకర్ కి సీక్వేలా ?

Double- iSmart
2019-02-26 12:24:25

ప్రస్తుతం ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్‌’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన మాస్ టచ్ తో రామ్ పాత్రను పూరి డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుందని అంటున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే ‘డబుల్ ఇస్మార్ట్‌’ అనే టైటిల్‌ను పూరి జ‌గన్నాథ్‌, చార్మి రిజిష్టర్ చేయించడం ఫిలింనగర్ లో చర్చనీయంసంగా మారింది. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంక‌ర్’ హైద‌రాబాద్ పరిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. రామ్ ఇందులో సగటు హైద‌రాబాదీ కుర్రాడిగా నటించనున్నాడు. ఆయన పాత్రే సినిమాకు మెయిన్ హైలైట్‌ అంటుండగా ఆయన సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వేసవిలో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరీ జగన్నాథ్‌కు ఇది 35వ చిత్రం కాగా రామ్‌కు 17వ సినిమా. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామ్, మణిశర్మ కాంబినేషన్‌లో వస్తోన్న పూర్తి స్థాయి తొలి చిత్రం ఇదే కాగా ఇంతకుముందు రామ్ కొన్ని సినిమాలకు మణిశర్మ నేపథ్య సంగీతం అందించారు. కానీ ఆల్బమ్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు.

More Related Stories