English   

అమేజాన్ పై కేస్ వేస్తున్న రౌడీ విజ‌య్ దేవ‌రొకండ‌..

Vijay Devarakonda's Rowdy Brand Court slams Amazon company
2019-02-26 21:06:15

విజయ్ దేవరకొండ క్రేజ్ చూస్తుంటే రోజురోజుకు మెంటల్ ఎక్కేస్తోంది. గబ్బర్ సింగ్ సినిమాలో రావు రమేష్.. పవన్ కళ్యాణ్ ను చూసి ఒక డైలాగ్ చెబుతాడు.. మార్కెట్లో ఇతడి ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది అని. ఇప్పుడు విజయ్ దేవరకొండను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. రౌడీ అనే బ్రాండ్ తో ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయాడు విజయ్ దేవరకొండ. హీరోగానే కాకుండా బిజినెస్ మాన్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు అర్జున్ రెడ్డి. ఇప్పుడు ఈ బ్రాండ్ కు ఓ రేంజ్ లో డిమాండ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి అమెజాన్ ఒక ప్లాన్ వేసింది. బెంగళూరులో రౌడీ వేర్ పేరుతో అచ్చం విజయ్ దేవరకొండ బ్రాండ్ ను తలపిస్తూ కాస్ట్యూమ్స్ అమ్మేస్తున్నారు. అవి అటు ఇటు తిరిగి అమెజాన్ లో కూడా కనిపించాయి.
ఇది విజయ్ దేవరకొండ వరకు రావడంతో తన అనుమతి లేకుండా తన బ్రాండ్ బట్టలను అమెజాన్ సోషల్ మీడియాలో ఎలా మార్కెటింగ్ చేసుకుంటుంది అంటూ ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అమెజాన్ సంస్థ సమాధానం చెప్పాలని తన లాయర్ ద్వారా ఆ సంస్థకు నోటీసులు పంపినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఈ కేసును పూర్తిగా తన న్యాయవాదికి అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన అనుమతి లేకుండా తన బ్రాండ్ వాడుతుంటే వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చట్టపరమైన నోటీసులు వాళ్లకు పంపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. మరి దీనిపై కోర్టు ఎలాంటి సమాధానం చెబుతుందో.. అమెజాన్ ఎలాంటి సంజాయిషీ ఇస్తుందో చూడాలి

More Related Stories