English   

రామ్ చ‌ర‌ణే భ‌య‌ప‌డ్డాడు.. నీకు అవ‌స‌ర‌మా నాని..? 

Nani
2019-02-27 03:06:43

ఇప్పుడు అభిమానులు ఇదే అడుగుతున్నారు న్యాచుర‌ల్ స్టార్ నానిని. రామ్ చరణ్ కూడా పెట్టుకోవడానికి భయపడిన టైటిల్ ను ఇప్పుడు నాని పెట్టుకున్నాడు. దానికి ఫలితాన్ని ఇప్పుడు తనకు తెలియకుండానే అనుభవిస్తున్నాడు న్యాచురల్ స్టార్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్ పెట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడో ఇప్పుడు ఆ టైటిల్ ఎంచుకున్నందుకు కచ్చితంగా బాధపడుతూ ఉంటాడు నాని. దానికి కారణం మెగా ఫ్యాన్స్. ఒకప్పుడు రామ్ చరణ్ సైతం గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ ముట్టుకోవడానికి భయపడ్డాడు. రచ్చ సినిమా కు ముందు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ అది పెడితే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక సాక్షాత్తు చిరంజీవి తనయుడు సైతం ఈ టైటిల్ కు దూరంగా ఉన్నాడు. ఇక సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు కూడా గ్యాంగ్ లీడర్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని చెప్పారు. అలాంటిది తన సినిమా కోసం గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకున్నాడు నాని. దీనిపై మెగాఫాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. నాని అద్భుతమైన నటుడే కానీ చిరంజీవి రేంజ్ కాదు.. ఆయన టైటిల్ వాడుకునే సత్తా గాని అర్హత గాని దానికి లేవు అంటూ వాళ్ళు మండి పడుతున్నారు. ఈ చిత్ర టైటిల్ కచ్చితంగా మార్చాల్సిందే మరో ఆప్షన్ లేదు అంటూ వాళ్ళు అల్టిమేటం పెట్టేస్తున్నారు. దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా ఫ్యాన్స్ తగ్గేలా కనిపించడం లేదు. మరి చివరికి గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ ఏమవుతుందో చూడాలి.

More Related Stories