English   

అబ్బా.. కంగ‌న ర‌నౌత్ టైమ్ చూసి కొట్టిందిగా.. బాల‌య్య‌పై సెటైర్లు.. 

Kangana
2019-02-27 10:42:28

ఎవరికైనా టైం రావాలి.. రాకపోతే అది వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలి.. ఇప్పుడు కంగనా రనౌత్ కూడా ఇదే చేసింది. మణికర్ణిక సినిమా విషయంలో క్రిష్ దగ్గర నుంచి బ‌లవంతంగా క్రెడిట్ అంతా లాగేసుకుంద‌నే విమ‌ర్శ‌లు ఈమె మూటగట్టుకుంది. పైగా క్రిష్ కూడా మ‌ణిక‌ర్ణిక సినిమాకు త‌న‌కు రెమ్యున‌రేష‌న్ కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు. ఇదే అదునుగా ఇప్పుడు మాట‌ల తూటాలు పేల్చింది కంగ‌న‌. ఈ సినిమా విజయం సాధించినా కూడా క్రిష్ తెరకెక్కించిన సినిమాను తన ఖాతాలో వేసుకుంది అంటూ కంగ‌న ర‌నౌత్ ను కొంద‌రు విమర్శించారు. వీటిని చూసి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది కంగ‌న‌. తనకు కూడా టైం వస్తుందని.. అప్పుడు చూసుకుందాంలే అన్నట్లు ఈ ముద్దుగుమ్మ వేచి చూసింది. ఇప్పుడు ఎడారిలో ఉన్న వాడికి కూల్ డ్రింక్ బాటిల్ దొరికినట్లు కంగనా రనౌత్ కు క్రిష్ అడ్డంగా దొరికిపోయాడు.  ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా డిజాస్టర్ కావడంతో ఆమె ఆడుకోవడం మొదలు పెట్టింది. సరిగ్గా టైం చూసి కొడుతుంది ఈ ముద్దుగుమ్మ. మణికర్ణిక సినిమా టైంలో క్రిష్ టాలెంట్ మొత్తం నేను తొక్కేశాన‌న్నారు కదా మరి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో క్రిష్ ఏం చేశాడు.. బాలకృష్ణ ఎంతో నమ్మి చేతుల్లో ఈ సినిమాను పెడితే ఆయన కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా దీన్ని తెరకెక్కించాడు.. ఇది క్రిష్ ప్రతిభ అంటూ ఎద్దేవా చేసింది కంగనా రనౌత్. పాపం బాలకృష్ణను చూస్తే బాధేస్తోంది అంటూ సెటైర్లు వేసింది ఈ భామ. ఈమెను చూసి నందమూరి అభిమానులు మండి పోతున్నారు. అసలే డిజాస్టర్ వచ్చిన బాధలో ఉంటే కంగనా రనౌత్ కావాలని ఇలా చేస్తుండటంతో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏదేమైనా ఇప్పుడు క్రిష్ కు బ్యాడ్ టైం నడుస్తుంది. మరి దీని నుంచి ఆయన ఎలా బయటపడతాడో చూడాలి.

More Related Stories