English   

మహర్షి కరెక్ట్ టైంకే వచ్చేస్తున్నాడట !

Mahesh Babu's Maharshi will hit screens on April 25
2019-02-27 08:54:06

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోన్న సంగంతి తెల్సిందే. మహేశ్ బాబు నాయకుడిగా ఆయన సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది.  ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవచ్చనీ, అందువలన ఈ సినిమా ఆ రోజున థియేటర్స్ కి రాకపోవచ్చనే టాక్ ఈ మధ్య బాగా వచ్చింది. జూన్ లో ఈ సినిమా విడుదల ఉండొచ్చనే ప్రచారం గట్టిగ జరిగింది. అయితే ఇదంతా కేవలం పుకార్లు మాత్రమేననీ, ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీనే విడుదల చేయనున్నారనే మాట దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటకు వచ్చింది. మార్చి 2వ వారానికి రెండు పాటలు మినహా మిగతా చిత్రీకరణ పూర్తవుతుందట. అయితే ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్యారలల్ గా జరుగుతున్నాయట. అందువలన చెప్పిన సమయానికి ఈ సినిమా థియేటర్స్ కి రావడం ఖాయమని తెలుస్తోంది. ‘భరత్‌ అనే నేను’ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్‌ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  విజయవంతమైన ‘ఊపిరి’ తర్వాత వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న  ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

More Related Stories