English   

స్వాతి నాయుడు పెళ్లి చేసేసుకుంది !

swathi  naidu real marriage photos
2019-02-27 09:30:06

నటి స్వాతి నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు పోర్న్ స్టార్‌గా గుర్తింపు పొందింది ఆమె. అడల్ట్ మూవీలతో పాటు పలు పోర్న్ చిత్రాల్లో నటించిందనే గుసగుసలు ఉన్నాయి. పొట్టకూటికోసం, సినీ అవకాశాల కోసం అలా నటించాల్సి వస్తోందని ఆమె స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది కూడా.  అలాంటి ఈ యూట్యూబ్ సెలెబ్రిటీ పెళ్లి చేసుకుంది. విజయవాడలో అవినాష్ అనే వ్యక్తిని ఈనెల 23వ తారీకున వివాహం చేసుకున్నాని ఆమె స్వయంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఎందుకంటే స్వాతి నాయుడు పెళ్లి వార్తను మొదట అంతా కొట్టి పారేశారు. కాని ఆమె తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో అంతా నమ్మాల్సి వచ్చింది. సినిమాల్లో నటిగా రాణించాలనే కోరికతో ఇంటి నుండి హైదరాబాద్ కు చేరిన స్వాతి నాయుడు సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఆమెకు టాలీవుడ్ లో ఛాన్స్ దొరకక బుల్లి తెర మీద ప్రయత్నాలు చేసింది. అక్కడా అవకాశం దక్కలేదు. నటిగా, యాంకర్ గా ప్రయత్నాలు చేసినా కూడా గుర్తింపు రాకపోవడంతో యూట్యూబ్ ద్వారా సాఫ్ట్ పోర్న్ సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చింది. వందల కొద్ది బూతు చిత్రాలు చేసిన స్వాతి నాయుడు అవినాష్ అనే వ్యక్తిని పెళ్ళాడింది. ఆ పెళ్లి అయ్యాక ఆమె తన కుటుంబ సభ్యులను కూడా మీడియాకి పరిచయం చేసింది. మరి ఈమె ముందు ముందు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేస్తుందా లేదా కొత్త జీవితం మొదలు పెడుతుందా అనేది చూడాలి. 

More Related Stories