English   

అఖిల్ కోసం విజయ్ హీరోయిన్ !

Akhil Akkineni  To Romance with Priyanka jawalkar For His Next,
2019-02-27 17:14:31

తెలుగు తెరకి 'టాక్సీవాలా' చిత్రం ద్వారా ప్రియాంక జవాల్కర్ పరిచయమైంది. షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన ఈ అనంతపూర్-మరాఠీ అమ్మ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుంది. తాజాగా ఈ భామకు పెద్ద అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రియాంక జవాల్కర్ అక్కినేని అఖిల్ తో రొమాన్స్ చేయనుందట. వరుసగా డిజాస్టర్ లను అందుకుంటున్న అక్కినేని అఖిల్ ఈ మధ్యనే 'మిస్టర్ మజ్ను' అనే సినిమాతో మరో ఫ్లాప్ ను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో  'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ వారు ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక కోసం ప్రియాంక జవాల్కర్ ను సంప్రదించారని సమాచారం. నిజానికి మొదటి సినిమా హిట్ తోనే ఈ అమ్మడి కెరీర్ ఎక్కడికో వెళుతుందని భావించినా ఆశించిన స్థాయిలో ఈ అమ్మడు స్పీడ్ చూపించలేదు. ఈ నేపథ్యంలో, రవితేజ హీరోగా రూపొందుతోన్న 'డిస్కో రాజా' సినిమాలో ప్రియాంకకి ఛాన్స్ దొరికినట్టుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ అమ్మడు ఈ సినిమాలతో అయినా లైన్ లో పడుతుందేమో !

More Related Stories