English   

రౌడీ బేబీ...మరో రికార్డు బద్దలుకొట్టిందిగా !

rowdy baby song reached another milestone
2019-02-27 18:43:31

యూట్యూబ్‌ లో రౌడీ బేబీ సాంగ్ దుమ్ము దులుపుతోంది. ఈ ఏడాది జనవరి 2న ఈ పాటను అప్‌లోడ్ చేయగా 250 మిలియ‌న్ వ్యూస్ అందుకుని స‌రికొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లికింది రౌడీ బేబీ సాంగ్. మారి 2 మూవీలోని ఈ సాంగ్‌లో తమిళ సూపర్‌స్టార్ ధనుష్, సాయి పల్లవి వెరైటీ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. తెలుగు మూవీ ఫిదాలోని వచ్చిండె సాంగ్ ఇప్పటివరకు సాయి పల్లవికి ఓ రికార్డుగా ఉండేది. ఈ పాటను యూట్యూబ్‌లో 18 కోట్ల 35 ల‌క్ష‌ల మంది చూశారు. అయితే పాట 180 మిలియ‌న్ అందుకోడానికి రెండేళ్లు తీసుకుంటే ఇప్పుడా రికార్డును రౌడీ బేబీ సాంగ్ బ్రేక్ చేసి  కేవ‌లం 45 రోజుల స‌మ‌యం మాత్ర‌మే తీసుకుంది. ఈ పాత ధనుష్‌ కు కూడా ఇదే కెరీర్ బెస్ట్ సాంగ్‌ గా నిలిచింది. గతంలో కొలవెరి డి సాంగ్‌ను 17 కోట్ల 50 ల‌క్ష‌ల మంది చూశారు. ఇద్దరు యాక్టర్స్‌కు ఇప్పుడీ రౌడీ బేబీయే బెస్ట్ సాంగ్ నిలవడం విశేషం. ఈ ఏడాది జనవరిలో యూట్యూబ్ పాపులర్ సాంగ్స్ లిస్ట్‌లో ఈ పాట నాలుగో స్థానానికి చేరిన రికార్డు కూడా ఉంది. సౌత్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పాట‌కు కూడా ఈ స్థాయి వ్యూస్ రాలేదు. ఇప్ప‌టికీ రౌడీ బేబీ పాట‌కు వ్యూస్ వ‌చ్చాయి ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవా ఈ పాటకు కొరియాగ్రఫీ చేయగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.

More Related Stories