English   

హీరో విశాల్ కి థాంక్స్ చెప్పిన నారాయణ ఎండీ !

Narayana group launches helpline for mental health issues
2019-02-27 13:19:42

విద్యార్థుల మానసిక ఒత్తిడిని దూరం చేయడం కోసం నారాయణ విద్యా సంస్థలు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఒత్తిడిని దూరం చేయడమే ప్రదాన లక్ష్యంగా దిశ కార్య క్రమాన్ని ప్రారంభించామని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ సింధూర నారాయణ పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానసిక రుగ్మతను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించకపోవడం, డాక్టర్‌కు చూపించాలనే ఆలోచన రాకపోవడం అనే అంశాల మీద  ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించటం ద్వారా సమాజంలో మానసిక రుగ్మతను పారద్రోలేందుకు నారాయణ గ్రూప్ ‘దిశ’  ప్రోగ్రామ్‌ను ప్రారంభించామని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం విద్యార్ధులు సహా సమాజంలో మానసిక రుగ్మతను పారద్రోలేందుకు దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. మానసిక రుగ్మతలను తెలుసుకునేందుకు నారాయణ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థుల కోసం దిశ కార్యక్రమాన్ని వైద్య నిపుణులతో ఏర్పాటు చేశామని అన్నారు. ఏ విద్యార్థి అయినా మానసిక రుగ్మతతో బాధపడితే ఉచితంగా సేవలు అందిస్తామని ఆమె అన్నారు. నారాయణ విద్యాసంస్థలు ప్రారంభించి 40 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతతో దిశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ డైరెక్టర్ పునీత్ పేర్కొన్నారు. మానసిక సమస్యలతో బాధపడే విద్యార్థులు 1800 419 1828 హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్న ఆమె దిశ కార్యక్రమాన్ని షార్ట్ వీడియో ద్వారా విద్యార్థులకు సందేశం అందించిన సినీనటు డు విశాల్‌ కు కృతజ్ఞతలు చెప్పారు.

More Related Stories