English   

మహేష్ బాబు నిర్మాత...గూడచారి మేజర్ అయ్యాడు !

Mahesh Babu debuts as producer for the film titled Major
2019-02-27 20:53:57

గత కొన్నాళ్ళగా వార్తలు వస్తున్నట్టే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా మారారు. క్షణం, గూఢచారి చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న అడివి శేష్‌తో కలసి ‘మేజర్’ అనే భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ ను ఈరోజు విడుదల చేశారు. ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో మేజ‌ర్ అనే ఈ భారీ చిత్రం రూపొంద‌నుంది. అడివి ఎంట‌ర్ టైన్మెంట్‌, శ‌ర‌త్ చంద్ర‌, ఎ+జి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు కానున్నారు. మేజ‌ర్ సినిమా షూటింగ్‌ ను ఈ ఏడాది వేస‌విలో ప్రారంభించి 2020లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాష‌ల్లో భారీ బడ్జెట్‌ తో నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొంద‌బోయే ఈ సినిమా 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌ తో తెర‌కెక్కించ‌నున్నారు. గూఢ‌చారి ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతుండగా అడివి శేష్ ఇందులో హీరోగా న‌టిస్తునే ఈ సినిమాకు ర‌చ‌యిత‌గా కూడా చేస్తున్నారు.

More Related Stories