English   

శ్రీ‌దేవి బ‌యోపిక్ కు ఆల్ సెట్.. హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

keerthy suresh may act in sridevi biopic
2019-02-27 14:15:08

తెలుగు ఇండస్ట్రీలో మరో బయోపిక్ రంగం సిద్ధమ‌వుతుంది. అసలే ఇప్పుడు వరసగా బయోపిక్స్ వస్తూనే ఉన్నాయి. విజయం సాధించినా.. అపజయం పొందినా కూడా మన దర్శకులు అసలు ఆగడం లేదు. కొత్తగా కథ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఎంచక్కా ఉన్న జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్, సావిత్రి లాంటి బయోపిక్స్ వ‌చ్చాయి. తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ కు కూడా రంగం సిద్ధమవుతోంది. తెలుగు నుంచి హిందీ వరకు తన సత్తా చూపించి ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా ప్రశంసలు అందుకున్న శ్రీదేవి బయోపిక్ కు ఇప్పుడు రాబోతుంద‌ని తెలుస్తుంది. దీనికి ఆమె భ‌ర్త బోనీకపూర్ అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు.
శ్రీదేవి బయోపిక్ గురించి ఈయ‌న కూడా ఇన్నాళ్లూ ఏమీ మాట్లాడలేదు కానీ ఆమె వర్ధంతి రోజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు తమిళ హిందీ భాషల్లో శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ను తీసుకోవాలని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు శ్రీదేవి పాత్రకు వందశాతం న్యాయం చేస్తుందని భావిస్తున్నారు. అందుకే కాస్త కష్టమైన పర్లేదు కానీ శ్రీదేవి పాత్ర కోసం కీర్తి సురేష్ ను ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు వాళ్లు. మ‌రి ఈ పాత్ర చేయడానికి కీర్తిసురేష్ ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

 

More Related Stories