English   

బోయపాటికి షాక్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ !

Boyapati Srinu gets shock from Mythri Movie Makers
2019-02-27 14:56:08

భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు, జయ జానకి నాయక లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గా అగ్రస్థానంలో కొనసాగిన బోయపాటి శ్రీను ఇమేజ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ఒక్క సారిగా పడిపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఈ సంక్రాంతికి విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్‌ అయ్యింది. ఈ ప్రభావం బోయపాటి శ్రీను తరువాత ప్రాజెక్ట్‌ లపై కూడా పడినట్టు చెబుతున్నారు. ఒకవైపు యంగ్ దర్శకులు హవా నడుస్తున్న సందర్భంలో కూడా బోయపాటితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించిన నిర్మాతలు సడెన్‌ గా సైడైపోతున్నారని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయనతో సినిమా చేసేందుకు ముందుగా ఇచ్చిన అడ్వాన్సులను సైతం తిరిగి తీసుకుంటున్నారట. ‘వినయ విధేయ రామ’ సెట్స్‌పై ఉన్నప్పుడే నందమూరి బాలక్రిష్ణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మైత్రీ మూవీ మేకర్స్‌‌తో వరుస సినిమాలను లైన్‌ లో పెట్టారు బోయపాటి. అయితే మైత్రీ మూవీ మేకర్స్ బోయపాటితో డీల్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ముందుగా ఇచ్చిన అడ్వాన్స్‌ని సైతం వెనక్కితీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలే రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ అయినా బాధలో ఉన్న బోయపాటి శ్రీను మైత్రి మూవీ మేకర్స్ మరో షాక్ ఇచ్చిందని అంటున్నారు.

More Related Stories