English   

మా రాజ‌కీయ వేడి రాజుకోబోతుంది.. గెట్ రెడీ ఫోక్స్..

MAA Elections Held on First Week of March
2019-02-27 15:12:24

రాష్ట్రంలో రాజకీయ వేడి నడుస్తోందిప్పుడు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారం చేసుకోవడంలో బిజీగా ఉన్నాయి. ఓ వైపు పవన్ కళ్యాణ్.. మరోవైపు చంద్రబాబు నాయుడు.. ఇంకోవైపు జగన్.. ఇలా ఎవ‌రికి వారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బిజీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మరో ఎన్నికలు కూడా ప్రేక్షకులకు, ప్రజలకు ఆసక్తి కలిగిస్తున్నాయి. అదే మా ఎన్నికలు.. ఇది వ‌ర‌కు మా అంటే కేవ‌లం సినిమా వాళ్లు మాత్ర‌మే ఆస‌క్తిగా చూసేవాళ్లు. కానీ కొంతకాలంగా మా ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి.. నిజమైన పొలిటికల్ హీట్ కూడా దీని ముందు తేలిపోయేంత‌గా వాళ్లు కొట్టేసుకుంటున్నారు. అంతగా సినీ.. మా ఎన్నికలు జరుగుతున్నాయి. ఓ వర్గంతో మరో వర్గం మాటల పోట్లు పొడుచుకుంటున్నాయి. గత ఎన్నికల్లో సీనియర్ నరేష్, శివాజీ రాజా చేసిన రచ్చ ఎప్పటికీ మర్చిపోలేము. ఇక ఇప్పుడు కూడా ఇదే స్థాయిలో ఎన్నికలు జరగబోతున్నాయని తెలుస్తోంది.
మార్చి తొలి వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోలు మా ఎన్నికలకు హాజరు కావడం మానేసి చాలా కాలం అవుతుంది. గత ఎన్నికల్లో ఒక్క బాలకృష్ణ మాత్రమే వచ్చి తన ఓటు వినియోగించుకున్నాడు. మిగిలిన స్టార్ హీరోలు ఎవరు ఆ ఎన్నికల్లో పాల్గొనలేదు. పైగా చిరంజీవి వర్గం, బాలకృష్ణ వర్గం, దాసరి నారాయణ రావు వర్గం అంటూ గత కొన్నేళ్లుగా ఎవరి వర్గాలు వారు విభజించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. శివాజీ రాజా మాత్రం ఈసారి కూడా విజయం తమదే అంటూ చెబుతున్నాడు. సినీ కార్మికుల కోసం మా అసోసియేషన్ చాలా చేస్తుందని.. అవన్నీ గుర్తు పెట్టుకొని మళ్ళీ తనే గెలిపిస్తారు అంటున్నాడు శివాజీ రాజా. మరి మార్చి తొలివారంలో జరగబోయే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

More Related Stories