English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ లాక్ అయిందా ?

Lakshmi's NTR gets release date
2019-02-28 01:44:02

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రంలో నంద‌మూరి తార‌కరామారావు జీవితాన్ని ల‌క్ష్మీ పార్వ‌తి దృష్టి కోణంలో చూపించ‌నున్న‌ట్టు వర్మ ఇది వరకే ప్రకటించారు. ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితంతో పాటు ల‌క్ష్మీ పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌న్నింటిని చూపనున్నానని ఇదివరకే ప్రకటించాడు. ఇప్ప‌టి దాకా రిలీజ్ అయిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్, ట్రైల‌ర్‌కి భారీ ఆద‌ర‌ణ ల‌బించ‌డంతో పాటు బాలయ్య రిలీజ్ చేసిన మొదటి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిల బడడంతో ఎ సినిమా మంచి హిట్ అవుతుంద‌ని ఆర్జీవీ టీం భావిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల గురించి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మహానాయకుడు విడుదల తేదీ ఖరారైన తరువాత లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తానని చెప్పిన వర్మ ఇంకా ఆ ప్రకటన మాత్రం చేయలేదు. దీంతో సినిమా అసలు ఎప్పుడు విడుదలవుతుందా ? అనే సందేహం మొదలయ్యింది అందరిలో. అయితే తాజా సమాచారం ప్రకారం మార్చి 15న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయట. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో “లక్ష్మీపార్వతి” పాత్రలో యజ్ఞాశెట్టి నటిస్తోండగా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు నటిస్తున్నాడు. ఇక చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుని రెడీ అవుతున్న ఈ సినిమా అయినా హిట్ అవుతుందేమో చూడాలి.

More Related Stories