English   

ఎఫైర్స్ ఉన్నాయి.. అంత మాత్రానికే ప్రెగ్నెన్సీ వ‌చ్చేస్తుందా..?

Is Raai Laxmi pregnant
2019-02-28 09:12:19

ఇప్పుడు ఈ మాట‌ల‌న్న‌ది ఎవ‌రో కాదు.. లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ కన్నడ హిందీ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఏ ఇండస్ట్రీలో కూడా స్టార్ కాలేకపోయింది. హిందీకి వెళ్లి అక్కడ భారీగా అందాలు ఆరబోసినా కూడా లక్ష్మీరాయ్ ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి వేర్ ఈజ్ వెంకటలక్ష్మి అనే సినిమా చేసింది. ఇదిలా ఉంటే తనపై వస్తున్న రూమర్లకు ఇప్పుడు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారంపై మండి పడింది లక్ష్మీ రాయ్. తనకు నిజంగా తినాలనిపించి ఒకవేళ పచ్చి మామిడి కాయలు తిన్నా కూడా వెంటనే లక్ష్మీరాయ్ గర్భవతి అంటూ వార్తలు రాస్తున్నారని.. తనపై ఇలా ఇష్టం వచ్చినట్లు వార్త‌లు రాసే హ‌క్కు మీకు ఎవరిచ్చారు అంటూ నిలదీస్తుంది లక్ష్మీరాయ్.
తనపై ఇలా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే కచ్చితంగా లీగల్ నోటీసులు పంపిస్తాన‌ని వార్నింగ్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. నిజంగానే తనకు గతంలో కొంత మందితో ఎఫైర్ ఉందని.. ఇందులో దాచి పెట్టడానికి ఏమీ లేదని ఓపెన్ గా సంచలన కామెంట్స్ చేసింది లక్ష్మీరాయ్. జీవితంలో ప్ర‌తీ విష‌యాన్ని దాచాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కానీ కొన్ని విష‌యాలు మాత్రం ప‌బ్లిక్ చేసుకోన‌ని చెబుతుంది ఈ భామ‌. జీవితంలో ఒక మంచి ఎలివేషన్ కోసం వేచి చూస్తున్నారని.. ఇప్పటివరకు అలాంటి రిలేషన్ తనకు ఎదురుగా లేదంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే గతంలో ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కొంత కాలం లవ్ ఎఫైర్ సాగించిందని వార్తలున్నాయి. అయితే తనకు గతంలో కొంత మందితో ఎఫైర్ ఉందని లక్ష్మీ రాయ్ చెప్పడంతో ఆ లిస్టులో ధోనీ కూడా ఉన్నాడేమో అనే ప్రచారం జరుగుతుంది. మ‌రి దీనికి ఆమె ఎలాంటి స‌మాధానం చెబుతుందో చూడాలిక‌.

More Related Stories