English   

మ‌హేష్ బాబుకు కోపం వ‌చ్చిందా.. మ‌హ‌ర్షి యూనిట్ కు స్పెష‌ల్ క్లాస్..

Mahesh-Babu
2019-02-28 09:16:12

మహేష్ బాబుకు కోపం రావడం చాలా అరుదు. ఎప్పుడో కానీ ఆయన తన టెంపర్ కోల్పోడు. ఇప్పుడు ఇదే జరిగిందని తెలుస్తోంది. మహర్షి సినిమా విషయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి తీరు మహేష్ బాబుకు అసలు నచ్చడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగానే తన సినిమాలను చాలా నెమ్మదిగా తీస్తాడు వంశీ పైడిపల్లి. ఈయన గత సినిమా ఊపిరి 2016లో విడుదలైంది. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇక మహర్షి సినిమా సెట్స్ పైకి వచ్చి కూడా దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ సినిమా పూర్తి కాలేదు. సంక్రాంతికి విడుదల అవుతుందని గతేడాది చెప్పినా కూడా అది జరగలేదు. ఆ తర్వాత మార్చ్ అన్నారు.. అది కూడా కుదరలేదు. ఏప్రిల్ 5న విడుదల చేస్తాం అంటూ దిల్ రాజు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు. 

ఆ తర్వాత మళ్లీ మరో 20 రోజులు పోస్ట్ ఫోన్ చేశారు సినిమాను. ఇక ఇప్పుడు ఏప్రిల్ 25న కూడా సినిమాను తీసుకురావడం కష్టం అంటూ వార్తలు వినిపిస్తున్న త‌రుణంలో మహేష్ బాబు అసహనం పెరిగిపోయిందని తెలుస్తోంది. ఏం చేస్తారో తెలియదు కచ్చితంగా ఏప్రిల్ 25న మహర్షి సినిమా విడుదల కావాల్సిందే అంటూ ల్టిమేటం పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో సినిమా షూటింగులో కూడా వేగం పెంచారు వంశీ పైడిపల్లి. కచ్చితంగా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మహర్షి విడుదల కావాల్సిందే అంటూ మహేష్ బాబు పట్టుపట్టడంతో ఇప్పుడు దర్శక నిర్మాతలకు కూడా టెన్షన్ పెరిగిపోయింది. మరి చివరి వరకు మహర్షి అనుకున్న తేదీకి వస్తాడో లేదో చూడాలి. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. 

More Related Stories