English   

శివ‌రాత్రికి సినిమాలు ఏంటో తెలుసా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పండ‌గే.. 

Mahesh-Charan
2019-02-28 03:45:54

శివరాత్రి వచ్చింది అంటే వెంటనే గుర్తొచ్చే పదం జాగారం. రాత్రంతా శివనామ స్మరణ చేస్తూ భక్తులు రెప్పవాల్చకుండా ఉంటారు. నిద్ర మానుకుని ఉండటం కూడా ఒక పూజలో భాగమే. శివరాత్రి వచ్చిందంటే థియేటర్స్ లో పాత సినిమాలు ప్రదర్శించడం కూడా మర్చిపోలేము. ఈసారి కూడా ఇదే జరుగుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పాత సినిమాలను మళ్లీ ప్రదర్శిస్తున్నారు థియేటర్ యాజమాన్యాలు. ఈసారి చిరంజీవి ఖైదీ నెంబర్ 150.. మహేష్ బాబు భరత్ అనే నేను.. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలు కనువిందు చేయనున్నాయి. శివరాత్రి కానుకగా వీటిని రాత్రిపూట ప్రదర్శించబోతున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాను శ్రీ మయూరి థియేటర్లో ఉదయం రెండు గంటల యాభై నిమిషాలకు ప్రదర్శిస్తున్నారు. దానికి ముందే 12 గంటల 15 నిమిషాలకు సుదర్శన్ థియేటర్ లో మహేష్ బాబు భరత్ అనే నేను షో పడనుంది.  ఇక 12 గంటల 30 నిమిషాలకు రామ్ చరణ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమా దేవి థియేటర్ లో ప్రదర్శిస్తున్నారు. ఈ మూడు సినిమాలతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈసారి మార్మోగిపోనుంది. మరి ఈ సినిమాల‌ను మరోసారి థియేటర్లో చూడాలనుకున్న అభిమానులకు ఇదే సువర్ణావకాశం. శివరాత్రి జాగారంతో పాటు చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలు మరోసారి థియేటర్ లో చూసిన అనుభవాన్ని కూడా పొందొచ్చు. మార్చ్ 4న మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ఈ చిత్రాలు ప్ర‌ద‌ర్శితం కానున్నాయి. 

More Related Stories