English   

మ‌హేష్ బాబుతో సిగ‌రెట్లు ఎవ‌రు మాన్పించారో తెలుసా..? 

Mahesh-Babu
2019-02-28 04:56:27

మహేష్ బాబు ఒకప్పుడు చైన్ స్మోకర్. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు పెట్టెల సిగరెట్లు తాగేవాడంటారు ఆయ‌న స‌న్నిహితులు. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజం. ఆయన కెరీర్ కొత్తలో సిగరెట్లు తెగ కాల్ చేశాడని చెబుతారు ఆయన ఫ్రెండ్స్. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మహేష్ బాబు మాత్రం కొంత కాలం పాటు దానికి బానిస అయిపోయాడు. అయితే ఎవ‌రెన్ని చెప్పినా మానని మహేష్ బాబు ఆ తర్వాత మాత్రం మెల్లగా సిగరెట్లు తాగడం తగ్గించాడు. దాని వెనుక ఒక చిన్న కథ కూడా ఉంది. ఒకప్పుడు పెట్టెలు పెట్టెలు సిగరెట్లు తాగే మహేష్ బాబు ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు పూర్తిగా ధూమపానానికి దూరంగా ఉన్నాడు. అంతేకాదు తన అభిమానులను కూడా సిగరెట్లు తాగవద్దు నీతి వాక్యాలు చెబుతున్నాడు సూపర్ స్టార్. ముందు తాను మానేసిన తర్వాత అభిమానులకు సిగరెట్ తాగొద్దు ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నాడు ఈయ‌న‌. ఇక మహేష్ బాబు సిగరెట్లు మానడానికి ఒక ముఖ్య కారణం ఆయన స్నేహితుడు. సూపర్ స్టార్ కు బాగా తెలిసిన ఫ్రెండ్ ఒకరు స్మోకింగ్ ఎలా మానేయాలి అని అలెన్ కార్ ఒక ఆంగ్ల రచయిత రాసిన పుస్తకాన్ని మహేష్ బాబుకు బహుమతిగా ఇచ్చాడు. అందులో హౌ టు క్విట్ స్మోకింగ్ ఈజీ అని రాసి ఉంది. దాన్ని ఫాలో అయిపోయి నిజంగానే సిగరెట్లు తాగడం మానేశారు మహేష్ బాబు. ఇప్పుడు పూర్తిగా దానికి దూరంగా ఉన్నాడు. పెళ్లయిన తర్వాత సిగరెట్లు మానేసి హాయిగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పుడు పూర్తిగా ఈయ‌న ఫ్యామిలీ ప‌ర్స‌న్ అయిపోయాడు. మొత్తానికి మహేష్ కెరీర్ లో మార్పు తీసుకొచ్చింది ఒక స్నేహితుడు. అందుకే అంటారు ఒక మంచి స్నేహితుడు ఉంటే జీవితంలో పైకి ఎదుగుతారు అని.

More Related Stories