English   

వైసీపీలో చేరిన ఎన్టీఆర్ మామ !

Narne-Srinivas
2019-02-28 06:06:30

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధువుల నార్నె శ్రీనివాసరావు ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. లోటస్ పాండ్ లో పార్టీ అధినేత జగన్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పది రోజుల క్రితం ఆయన జగన్ ను కలవడమే పలు చర్చలకు తావివ్వగా ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాను పార్టీలో చేరడానికి, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదని కూడా నార్నె పేర్కొన్నారు. తాను ఏ స్థానాన్నీ  ఆశించడం లేదని, జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని, అందుకే పార్టీలో చేరానని స్పష్టం చేశారు. అయితే ఆయన ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ మాత్రమే కాక, చంద్రబాబుకు స్వయానా మేనకోడలి భర్త. అయితే ఎన్టీఆర్ తో ప్రణతి వివాహం చేయడంలో కూడా బాబుదే ప్రధాన పాత్ర, అయితే 2009 ఎన్నికల్లో ప్రచారానికి చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్‌ని వాడుకొని ఆ తర్వాత దూరం పెట్టేశాడు. ఈ క్రమంలోనే నార్నె టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆయన వైసీపీ పార్టీలో చేరిపోయారు.

More Related Stories