English   

నార్నేకి ఆ టిక్కెట్టు ఇచ్చినట్టేనా ?

Narne-Srinivasa-Rao
2019-02-28 07:51:25

బడా పారిశ్రామికవేత్త, ఎన్టీఆర్ మామ అయిన నార్నే శ్రీనివాసరావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక ఎంపీ సీటు నుంచి లేదా కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయినా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. వైసీపీ సీటు కోసం ఆయన ట్రై చేసినా చివర్లో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన వెనక పడ్డారు. అయితే ఈరోజు ఆయన ఏకంగా పార్టీ తీర్ధమే పుచ్చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన మీద పొలిటికల్ రూమర్స్ వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో శ్రీనివాసరావు వైసీపీ నుంచి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిలకలూరిపేట వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఎన్నారై విడదల రజనీ ఉన్నారు, ముందు నుండీ ప్రత్తిపాటి వెనక ఉన్న ఆమె అనూహ్యంగా పార్టీలో చేరి అప్పటి సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ని పక్కన పెట్టి సమన్వయ కర్త అయిపోయారు. అయితే ఇప్పుడు మంత్రిగా ఉన్న ప్రత్తిపాటిని ఢీ కొట్టాలంటే సామాజికవర్గపరంగాను, ఆర్థికంగాను బలమైన వ్యక్తి అయిన నార్నే అయితేనే కరెక్ట్ అని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. ఆయనకు చిలకలూరిపేట టిక్కెట్ ఇస్తే జిల్లాలో పార్టీకి కూడా ఆర్థికంగా ఎంతో సాయం చేస్తాడన్నది వైసీపీ ప్లాన్‌. అయితే వైసీపీ అంచనాలు ఎలా ఉన్నా అక్కడ కాస్త స్ట్రాంగ్ అయిన రజనీ తప్పుకుని సీటు ఇస్తుందా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మరో ప్రయట్నంయంగా ఆయనకి అద్దంకి సీటు ఇవ్వాలని భావిస్తుందట వైసీపీ, అక్కడ గత ఎన్నికల్లో గెలిచిన గొట్టిపాటి రవి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నాడు, దీంతో ఈసారి ఎలా అయినా గెలవాలని అక్కడ మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యని నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ప్రకటించారు. మరి నార్నే రూటు ఎలా ఉంటుందో  ? చూడాలి. 

More Related Stories