English   

పెళ్లి పత్రికలు పంచుతున్న ఆర్య !

Arya
2019-02-28 15:55:39

తమిళ హీరో ఆర్య హీరొయిన్ సాయేశాను ప్రేమ వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పెళ్లికి పిలుపులు కార్యక్రమం మొదలుపెట్టారు. సన్నిహితులు ఒక్కొక్కరి ఇంటికీ వెళ్లి స్వయంగా వివాహ ఆహ్వాన పత్రికలు ఇచ్చి, పెళ్లికి తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నారట ఈ కాబోయే జంట. బాలీవు నటుడు దిలీప్‌కుమార్‌ మనవరాలు సాయేషా సైగల్‌ తో ఆర్య ప్రేమలో ఉన్నానని  ఫిబ్రవరి 14న పెద్దల అనుమతితో, ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించాడు. హైదరాబాద్‌ లో మార్చి 9, 10వ తేదీల్లో పెళ్లి జరగనుందని సమాచారం. తనను పెళ్లికి ఆహ్వానించడానికి ఆర్య వచ్చిన సందర్భంగా విశాల్‌ ఓ ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. నా హృదయానికి దగ్గరైన ఫొటో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆర్య వివాహ ఆహ్వాన పత్రికను అందుకోవడం నమ్మశక్యంగా లేదని విశాల్‌ పేర్కొన్నారు. అయితే ముంబయికి చెందిన సాహేషా చెన్నైకి చెందిన ఆర్యల పెళ్లి మద్యలో హైదరాబాద్ లో నిర్వహించడంకు గల కారణం ఏంటా అంటూ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళ సినీ రంగ ప్రముఖులు ఎంతో మంది హాజరు అయ్యే వివాహాన్ని హైదరాబాద్ లో నిర్వహించనున్న నేపథ్యంలో వారి పెళ్లి రోజు ఇక్కడ సందడి నెలకొననుంది.

More Related Stories