English   

గోవా చేక్కేస్తున్న ఇస్మార్ట్ శంకర్ !

Ismart-Shankar
2019-02-28 09:31:41

రామ్‌ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. చార్మీ సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే ఈ రోజుతో ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యిందట. త్వరలోనే మొత్తం యూనిట్ అంతా గోవా వెళుతున్నామని సినిమా నిర్మాత చార్మీ మీడియాకి ఒక వీడియో విడుదల చేసింది.  అయితే ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే చార్మీ 'డబుల్ ఇస్మార్ట్ ' టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారన్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా రూపొందించనున్నారట. అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ అయితేనే దానికి సీక్వెల్ ఉంటుందనీ, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఇలా డబుల్ ఇస్మార్ట్ టైటిల్ ను రిజిస్టర్ చేయించి ఉంటారని చెప్పుకుంటున్నారు. సక్సెస్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తోన్న రామ్ కీ పూరికి ఇద్దరికీ ఈ సినిమా కీలకమే మరి ఈ సినిమా వీరు అనుకున్నట్టు సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.

More Related Stories