English   

ప్ర‌భాస్, చిరంజీవి ఒకేసారి వ‌స్తే ప‌రిస్థితేంటి..?

Saaho
2019-02-28 19:12:39

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు చిరంజీవి వచ్చి ప్రభాస్ మీద పడేటట్టు కనిపిస్తున్నాడు. సైరా సినిమా అనుకున్న దానికంటే ముందే పూర్తి కానుంది. ఇప్పుడు ఇదే ప్రభాస్ అభిమానుల్లో ఇదే టెన్షన్ పెంచుతుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఈ రెండు సినిమాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని ముందు దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేసినా ఇప్పుడు మాత్రం మనసు మార్చుకొని ముందే తీసుకురావాలని చూస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. దానికి తగ్గట్లుగానే దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. అన్నీ కుదిరితే ఆగ‌స్ట్ లో సైరా నరసింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ నిర్మాత. ఇదిలా ఉంటే ప్రభాస్ సాహో సినిమా కూడా అప్పుడే విడుదల కానుంది. 

దాంతో ఇప్పుడు సైరా, సాహో మధ్య రేస్ నడుస్తుందిప్పుడు. ఇప్పటికే సాహో షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక సెట్టు వేసి చివరి షెడ్యూల్ పూర్తి చేస్తున్నాడు దర్శకుడు సుజీత్. మార్చి 3న శ్రద్ధా కపూర్ బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియో కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సైరా సినిమా కూడా ఆగస్టులోనే వస్తుంద‌నే వార్తలు వినిపిస్తున్న సాహో యూనిట్ లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా సైరా సినిమాఫై కూడా ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇలాంటి రెండు సినిమాలు ఒకేసారి వస్తే ఖచ్చితంగా ఇద్దరికీ నష్టం జరుగుతుంది. దాంతో ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలని చూస్తున్నారు. మ‌రి చివ‌రి వ‌ర‌కు ఎవ‌రు వెన‌క్కి జ‌రుగుతారో చూడాలి.

More Related Stories