English   

ఫైనల్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని లాక్ చేశాడుగా !

Lakshmi's NTR to release on March 22nd
2019-02-28 15:44:03

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జననం నుండి ఆయన సతీమణి మరణం దాకా బాలయ్య సినిమా తీయగా దానికి కొనసాగింపుగా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం నుండే ఎదో ఒక విధంగా సినిమాని వార్తల్లో నిలుపుతూ వస్తున్నాడు వర్మ. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్రబిందువైన ఈ సినిమా బిజినెస్‌ పరంగా కూడా సంచలనాలు నమోదు చేస్తుందంటూ ప్రచారం జరిగింది. భారీ మొత్తానికి సినిమాను అమ్మేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఖండించిన వర్మ ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులకు సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలన్ని పుకార్లేనని కొట్టిపారేశారు. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ సినిమాని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు.

More Related Stories