English   

స‌మాజంలో మంచి మొగుళ్లు అస‌లున్నారా.. జ‌య‌ప్ర‌ద సంచ‌ల‌నం..

Society fails to produce good husbands says Jaya Prada
2019-02-28 23:14:55

భారతీయ పెళ్లి వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసింది సీనియర్ నటి జయప్రద. మన సొసైటీలో మంచి భార్యలు ఎలా ఉండాలో నేర్పించే వాళ్ళు ఉన్నారు కానీ మంచి భర్తలు ఎలా ఉండాలో చెప్పే వాళ్ళు మాత్రం లేదు అంటుంది జయప్రద. ఇప్పటివరకు తనకు అలాంటి వాళ్ళు ఎప్పుడు కనిపించలేదని.. అసలు సొసైటీలో మంచి భర్తలు అనేవాళ్లు లేరు అంటూ సంచలన కామెంట్స్ చేసింది ఈమె. అందుకే ఈమె పెళ్లి చేసుకోలేదేమో అంటూ సెటైర్లు కూడా పడుతున్నాయిప్పుడు. ఈ మధ్యకాలంలో రాజకీయాల నుంచి కాస్త ఫ్రీ అయిన జయప్రద ప్రస్తుతం సీరియల్స్ చేస్తుంది. కెరీర్లో తొలిసారి టెలివిజన్ రంగం వైపు వచ్చిన జయప్రద.. పర్ఫెక్ట్ పతి అనే సీరియల్ చేస్తోంది. ఇందులో రాజ్య‌శ్రీ అనే అత్త పాత్రలో నటిస్తోంది ఈమె, ఆడవాళ్లకు అన్యాయం జరిగితే అస్సలు తట్టుకోలేని పాత్ర ఇది.
కోడలుకు న్యాయం చేయడానికి కన్న కొడుకుని సైతం చంపే పాత్ర ఇది అంటుంది జయప్రద. ఇందులో భాగంగానే ఇండియన్ మ్యారేజ్ వ్యవస్థపై ఈమె సంచలన కామెంట్స్ చేసింది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక మంచి భార్య ఎలా ఉండాలో అంతా చెబుతున్నారు కానీ.. ఒక మంచి భర్త ఎలా ఉండాలి అనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదని.. ఎందుకు మంచి భర్తను మన సొసైటీ సిద్ధం చేయలేకపోతుంది అంటూ ప్రశ్నిస్తుంది జయప్రద. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు. అలా అని సొసైటీలో ఉన్న మ‌గ‌వాళ్లంతా చెడ్డ‌వాళ్ల‌ని కాదు. అది ఆమె అభిప్రాయం మాత్రమే. అయితే పెళ్లి చేసుకోకుండా భర్తలపై ఇలా కామెంట్ చేయడం మాత్రం సరైన పద్ధతి కాదు అంటున్నారు కొందరు విశ్లేషకులు. మరి దీనికి జయప్రద ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

More Related Stories