English   

బన్నీకి పెళ్లి అయినా నేను రెడీ !

Noorin Shereef sensational comments on Allu Arjun
2019-02-28 23:39:28

లవర్స్ డే మూవీ ఫెయిల్ అయినా ఆమూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నూరీన్ షరీఫ్ కు మంచి పేరే వచ్చింది. లవ్, రొమాన్స్ లతో తెరకెక్కించిన ఈ సినిమా యూత్ అంచనాలను అందుకోలేక పోవడంతో ఫ్లాప్ అయింది. అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా ఈ మూవీ సక్సస్ అయిందంటూ హైదరాబాద్ లో నిర్వహించిన ఈమూవీ సక్సస్ మీట్ లో నూరీన్ షరీఫ్ ఆలు అర్జున్ మీద సంచలన కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ కి మాలీవుడ్ లో క్రేజ్ ఎంత్ అ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే తాను బన్నీ వీరాభిమానిని అని చెపుతూ లవర్స్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ తన చేతిలో చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడినప్పుడు ఆ ఆప్యాయత శాస్వితంగా ఉండిపోవాలి అంటే తాను బన్నీని పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే  అల్లు అర్జున్ మూవీలో తనకు ఒక చిన్నపాత్ర ఇచ్చినా చాలని అలా నటించినందుకు తనకు ఒక్కరూపాయి కూడ పారితోషికం వద్దని అంటూ బన్నీ నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. అదీ కాక అంతకుముందు ఆమె ప్రియా ప్రకాష్ మీద సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాక్యలను గురించి ఒక మీడియా వ్యక్తి అడగగా వాస్తవానికి మొదట్లో తనను ఈమూవీ కోసం ఎంపిక చేసినప్పుడు తాను మెయిన్ హీరోయిన్ అని చెప్పారనీ అయితే ఆ తరువాత ప్రియ వారియర్ కు పెరిగిన క్రేజ్ రీత్యా ఆమె పాత్రను పెంచి తన పాత్రను తగ్గించారని ఇలా అయినందుకు తనకు ప్రియా వారియర్ పై కోపం వచ్చినా ఇది అంతా ఇండస్ట్రీలో సర్వసాధారణం అని తెలుసుకుని తాను సద్దుకు పోతున్నానని అంటోంది.

 

More Related Stories