English   

పెళ్లి ప‌నుల్లో బిజీ అయిపోయిన విశాల్..

vishal busy with his marriage  work
2019-03-01 00:14:52

విశాల్ పెళ్లి పనులతో బిజీ అయిపోయాడు.. అయితే ఇక్కడ ఆయన బిజీ అయింది మాత్రం తన పెళ్లితో కాదు. స్నేహితుడు ఆర్య పెళ్లి ప‌నుల‌తో. మార్చి 9న హైదరాబాదులో ఆర్య పెళ్లి జరగబోతుంది. దీనికి తెలుగు, త‌మిళ్ ఇండ‌స్ట్రీ నుంచి అతిర‌థ మ‌హార‌థులు హాజ‌రు కానున్నారు. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అఖిల్ హీరోయిన్ సయేషా సైగల్ తో ఆర్య ఏడడుగులు నడవబోతున్నాడు. వీళ్ళిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఇప్ప‌టికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాయి. ఇక పెళ్లి తేదీ దగ్గర పడటంతో వెడ్డింగ్ కార్డులు పంచడంలో బిజీ అయిపోయాడు ఆర్య. ఈ సందర్భంగా ఆయన ప్రాణ స్నేహితుడు విశాల్ కు కూడా పత్రిక ఇచ్చాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు విశాల్. తన స్నేహితుడు పెళ్లి పత్రికను చూస్తూ మురిసిపోతున్నాడు ఈ కుర్ర హీరో. త్వరలోనే ఈయ‌న కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. తెలుగమ్మాయి అనీషతో విశాల్ తన జీవితాన్ని పంచుకోనున్నాడు. మార్చిలోనే ఈయన పెళ్లి కూడా జరగబోతుంది. దానికి ముందే ఆర్య పెళ్లి జరుగుతుండటంతో స్నేహితుడి పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు విశాల్. ఆ తర్వాత ఇదే బాధ్యత ఆర్యకు కూడా వస్తుంది.

More Related Stories