English   

విజయ్ సినిమా రిలీజ్ డేట్ లాకయ్యింది ?

Vijay Devarakonda Dear comrade gets release date
2019-03-01 08:27:55

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. గీత గోవిందం తో హిట్ పెయిర్ అనిపించుకున్నసెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక మందన్న రెండవ సారి జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. కాకినాడలో షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం దరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాలో రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తుండగా విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాని మే 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారని తెలుస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారు కావొచ్చని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయ్యింది దాంతో డియర్ కామ్రేడ్ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకే మేలో పెద్దగా సినిమాలు ఏవీ రిలీజవుతున్న దాఖలాలు లేకపోవడంతో ఆ రోజునే రిలీజ్ చేసే అవకాశం ఉంది.

More Related Stories